About us

పేరు పురుమల్ల శ్రీనివాస్ కరీంనగర్ పట్టణానికి ఆనుకుని ఉన్న బొమ్మకల్ గ్రామానికి గత 20 సంవత్సరాలుగా ఉప-సర్పంచ్, సర్పంచ్ గా చేస్తూ అభివృద్దిని చూపిస్తూ ప్రజల నుండి మంచి పేరును పొందుతున్నారు…

వీరు 10/10/1973 లో బొమ్మకల్ గ్రామంలో పురుమల్ల మల్లవ్వ – హన్మంతులకు 6వ సంతానంగా జన్మించారు. వీరిది ఒక సాధారణ మధ్యతరగతి రైతు కుటుంబం. బొమ్మకల్, దుర్షెడ్ మరియు కరీంనగర్ లో విద్యాభ్యాసం పూర్తి చేసి, యుక్త వయస్సుకు వచ్చే సరికి అతని గ్రామం పైన దృష్టి సారించారు. సామాజిక కార్యకర్తగా వీరి రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టారు.

ఇతని కృషిని పట్టుదలను చూసి గ్రామ ప్రజలు ఇతనే తమ గ్రామ నాయకుడిగా ఉండాలని 2001 – 2006 వరకు ఉపసర్పంచ్ గా ఎన్నుకున్న వార్డు సభ్యులు మరియు గ్రామ ప్రజలు, 2006 – 2011 వరకు సర్పంచ్ గాను, మళ్ళీ        2013 – 2018 వరకు వీరి భార్యమణి అయిన శ్రీమతి పురుమల్ల లలిత-శ్రీనివాస్(10-10-1981) గారు సర్పంచ్ గా కొనసాగించారు. తర్వాత వచ్చిన 2019 సర్పంచ్ ఎన్నికలలో కూడా మళ్లీ భారి మెజారిటీతో సర్పంచ్ గా గెలిపించారు. అలాగే వీరి సతీమణి అయిన పురుమల్ల లలిత-శ్రీనివాస్ గారు కరీంనగర్ రూరల్ ZPTC ఎన్నికలలో 6,170 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

తమ గ్రామానికి సర్పంచ్ గా  మరియు చుట్టుప్రక్కల గ్రామాలకు ZPTC గా అభివృద్దిని చూపిస్తూ పురుమల్ల లలిత-శ్రీనివాస్ దంపతులు ఆదర్శంగా నిలుస్తున్నారు.

మరిన్ని వివరాలు :

  1. పురుమల్ల శ్రీనివాస్ గారు 1992 నుండి 2018 వరకు కాంగ్రెస్ లో ఉన్నారు.
  2. 2014, కరీంనగర్ ఉమ్మడి మండల ZPTC ఎన్నికలలో 6000 పైచిలుకు ఓట్ల తేడా తో ఓటమిని చవి చూసారు.
  3. వీరు వీరి గ్రామానికి చేస్తున్న అభివృద్దిని చూసి తెలంగాణ రాష్ట్ర సమితీ (TRS) ప్రభుత్వం పురుమల్ల లలిత – శ్రీనివాస్ గార్లను వారి పార్టీలో చేర్చుకుంది.